Nandyala: పెళ్లికి వెళ్తే.. ఇల్లు ఖాళీ.. నంద్యాల మండలంలో భారీ చోరీ

Nandyala: నంద్యాల మండలం పాండురంగాపురంలో భారీ చోరీ జరిగింది. వివాహానికి వెళ్లిన సమయంలో 37 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు అపహరించారు.

R Pavankalyan, Nandyal
Updated on: 22 April 2026 5:38 PM IST
Nandyala
X

Nandyala: పెళ్లికి వెళ్తే.. ఇల్లు ఖాళీ.. నంద్యాల మండలంలో భారీ చోరీ

నంద్యాల జిల్లా: నంద్యాల మండలం పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి అనే వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు పెద్ద మొత్తంలో ఆభరణాలు మరియు నగదును అపహరించారు. పోలీసుల సమాచారం ప్రకారం, కృష్ణారెడ్డి దంపతులు గత శుక్రవారం బెంగుళూరులో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ సమయంలో ఇంటిని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

ఇంట్లో ఉన్న సుమారు 37 తులాల బంగారం, దాదాపు ఒక కిలో వెండి, అలాగే రూ.1 లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.ఇంటి తలుపు తెరిచి ఉండటం గమనించిన స్థానికులు అనుమానం వ్యక్తం చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య తెలిపారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story