Srisailam: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం.. శివనామస్మరణతో మారుమోగిన క్షేత్రం!
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు.
Srisailam: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం.. శివనామస్మరణతో మారుమోగిన క్షేత్రం!
Srisailam: శ్రీశైల మహా క్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు.అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని,అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని,జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని,దేశంలో అగ్నిప్రమాదాలు,వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది.
గంగాధర మండపం నుంచి నందిమండపం, మళ్లీ నంది మండపం నుండి గంగాధరం మండపం వరకు వరకు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహించారు స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు స్వర్ణ రథోత్సవంలో ఆశీనులై స్వామి అమ్మవార్లు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం,తప్పెట చిందులు,జానపద కళారూపాలు సంప్రదాయ నృత్యం చేశారు. స్వర్ణరథోత్సవం కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకస్వాములు,దేవస్థానం సిబ్బంది పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.




