Kurnool: కర్నూలులో ఘనంగా ‘మానవత’ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం!
Kurnool: కర్నూలులో మానవత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. రూ. 6.70 లక్షల విలువైన ఉచిత పార్థివ దేహ రవాణా అంబులెన్స్ విరాళంగా అందజేసిన దాత కసిరెడ్డి.
Kurnool: కర్నూలులో ఘనంగా ‘మానవత’ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం!
కర్నూలు: ఘనంగా మానవతా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం (2026-27) :- మానవత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం మానవత కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మానవత వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, సెంట్రల్ కమిటీ నుంచి శివశంకర్ రెడ్డి సుబ్బయ్య హాజరు కావడం జరిగింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముందు మానవత ఆధ్వర్యంలో జిల్లాలో "ఉచిత పార్థివ దేహ రవాణా సేవ" కోసం రు.6.70 వేల విలువైన అంబులెన్స్ ను దాతలు కసిరెడ్డి శివశంకర్ రెడ్డి విరాళంగా ఇవ్వడం జరిగింది.
నూతన కమిటీ అధ్యక్షులుగా ఏవీ. కృష్ణా రెడ్డి, సెక్రటరీ అప్పారావు, ట్రెసరర్ సత్యనారాయణ, మహిళ కమిటీ అధ్యక్షులుగా చంద్ర కళ, జనరల్ సెక్రటరీ విజయ భారతి, సెక్రెటరీ సఖ్యత లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ లు మనోహర్ రెడ్డి, యాని ప్రతాప్ మేడమ్, యుగంధర్ , పాటిల్ హనుమంత రెడ్డి, శివారెడ్డి, రమణ, అపర్ణ , ప్రసాదు, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కమిటీ ల పూర్తి సమాచారం, హాజరైన వారి పూర్తి పేర్లు సమాచారం అందలేదు కావున అందరి పేర్లు పెట్ట లేదని అన్యదా భావించ వలదు.. అర్థం చేసుకోగలరు... కమిటీల పూర్తి సమాచారం అందరు పేర్లతో లిస్టులో పెడతాము..




