Mantralayam: మంత్రాలయంలో పూజారి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం
Mantralayam: అనారోగ్యంతో మృతి చెందిన మంత్రాలయం శివాలయం పూజారి జంగం రాఘవేంద్ర కుటుంబానికి 1997 టెన్త్ బ్యాచ్ స్నేహితులు రూ. 65 వేల ఆర్థిక సాయం.
Mantralayam: మంత్రాలయంలో పూజారి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం
మంత్రాలయం: మంత్రాలయంలోని పాతవూరు శివాలయం పూజారి జంగం రాఘవేంద్ర గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1997వ సంవత్సరం లో 10వ తరగతి బ్యాచ్ స్నేహితులు మృతుడి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కలిసి మానవత్వం తో రూ 65 వేల నగదును జమ చేశారు.
జమ చేసిన నగదును బుధవారం జంగం రాఘవేంద్ర సతీమణి పార్వతి కి అందజేసి ధైర్యం గా ఉండాలని మేమంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, టీడీపీ టౌన్ ఇన్ చార్జ్ వరదరాజు లు, ప్రతాప్, భాస్కర్, నబి, రమేష్, ఖాన్, నాగరత్న, సరిత, గౌడ్, శంకర్ రెడ్డి, ఇల్లూరి వీరేంద్ర, నూర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.




