Markapur: గొట్టిపడియలో కలెక్టర్ వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు!

Markapur: గొట్టిపడియలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలపై వెలిగొండ ముంపు నిర్వాసితులు కలెక్టర్ వాహనాలను అడ్డుకోగా, కలెక్టర్ హామీతో ఆందోళన సద్దుమణిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 Aug 2026 9:41 AM IST
Markapur
X

Markapur: గొట్టిపడియలో కలెక్టర్ వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు!

Markapur: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ గ్రామం ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముంపు గ్రామాలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జేసీ పులి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారుల వాహనాలను నిర్వాసితులు అడ్డుకున్నారు.

తమలో అందరికీ ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని, ఇళ్ల పట్టాల విషయంలో కూడా తేడాలు ఉన్నాయని నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం బస్సులో ఉన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత స్వయంగా కిందికి వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా, అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story