Markapur: మార్కాపురంలో ఆధార్ సేవల పేరుతో అధిక వసూళ్లు - ప్రజల ఆరోపణలు!

Markapur: మార్కాపురంలోని ఆధార్ కేంద్రాలు, ప్రైవేట్ షాపుల్లో నిర్ణీత రుసుం కంటే అధిక వసూళ్లు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల తనిఖీకి విజ్ఞప్తి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Oct 2026 10:05 AM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో ఆధార్ సేవల పేరుతో అధిక వసూళ్లు - ప్రజల ఆరోపణలు!

Markapur: మార్కాపురం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోని ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ అప్‌డేట్‌కు నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.75 చెల్లించాల్సిన చోట రూ.150 వరకు తీసుకుంటున్నారని, రసీదు విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

మార్కాపురం ప్రధాన తపాలా కార్యాలయంలోనూ ఆధార్ సేవల సమయపాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదనపు రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఇక పట్టణంలోని కొన్ని ప్రైవేట్ కంప్యూటర్, జిరాక్స్ కేంద్రాల్లో ఆధార్‌కు సంబంధించిన చిన్నచిన్న సేవలకు కూడా రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆధార్ సేవల పేరుతో అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని, అన్ని కేంద్రాల్లో నిర్ణీత రుసుములు, సేవల సమయాలను స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM