Markapur: ఆర్టీసీ బస్టాండా? లేక ఆటో స్టాండా? ప్రయాణికుల ఇబ్బందులు!
Markapur: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటోల అక్రమ పార్కింగ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Markapur: ఆర్టీసీ బస్టాండా? లేక ఆటో స్టాండా? ప్రయాణికుల ఇబ్బందులు!
Markapur: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల నూతన సిమెంట్ రోడ్లు నిర్మించినప్పటికీ, ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. బస్టాండ్ ఆవరణలో బస్సులు నిలిపే ప్రాంతాన్ని ఆటోలు ఆక్రమించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రధాన ద్వారం నుంచి బస్టాండ్‌లోకి ప్రవేశించే మార్గంలో ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందితో కూడా కొందరు ఆటో డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా బస్టాండ్ వెలుపల ప్రధాన రహదారులపై కూడా ఇష్టానుసారంగా ఆటోలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బస్సుల రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని బస్టాండ్ ఆవరణలో ఆటోల అక్రమ పార్కింగ్‌ను నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.




