Markapur: విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

Markapur: మార్కాపురం SVKP కాలేజీ 1983 బీకాం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యాదానమే గొప్పదని పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Aug 2026 5:33 PM IST
Markapur
X

Markapur: విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

Markapur: మార్కాపురం SVKP కాలేజీ 1983 బీకాం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సి.హెచ్.పి. వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు చిన్న సహాయం కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. విద్య జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, ఉపాధ్యాయుడిగా పనిచేశానని, తన తండ్రి కూడా ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు.“విద్యాదానం మహాదానం” స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. ఎర్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు 1983 బీకాం బ్యాచ్ పూర్వ విద్యార్థులు జి.పి. రామయ్య, సి.హెచ్.పి. వెంకటరెడ్డి, ఆర్.కె.జె. నరసింహం, ఎస్.కె. ఆదం సాహెబ్, తిరుమలశెట్టి వీరయ్య, ఎం.వి. గోపికృష్ణరెడ్డి, కె. పద్మనాభయ్య పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story