Markapuram: జేసీ పులి శ్రీనివాసులును కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు: రెవెన్యూ సేవలపై కీలక చర్చ!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులును రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 May 2026 8:56 PM IST
Markapuram
X

Markapuram: జేసీ పులి శ్రీనివాసులును కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు: రెవెన్యూ సేవలపై కీలక చర్చ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం కలెక్టరేట్‌లో రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై వారు పరస్పరం చర్చించుకున్నారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించే దిశగా అధికారులు కృషి చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అలాగే మార్కాపురం జిల్లాలో జరుగుతున్న పరిపాలనా కార్యక్రమాలు, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆయనతోపాటు.డిఏఓ.రవీంద్రారెడ్డి,ఎమ్మార్వో కిరణ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story