Markapuram: పొదిలి సచివాలయాల్లో కలెక్టర్ తనిఖీ.. అధికారుల తీరుపై అసంతృప్తి

Markapuram: 48 వేల జనాభా ఉన్న పొదిలిలో 520 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లే రావడంపై మార్కాపురం కలెక్టర్ సునీత అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 15 Sept 2026 3:18 PM IST
Markapuram
X

Markapuram: పొదిలి సచివాలయాల్లో కలెక్టర్ తనిఖీ.. అధికారుల తీరుపై అసంతృప్తి

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ బి.సునీత అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీకి కేవలం 520 ఎన్టిఆర్ భరొస పెన్షన్ల దరఖాస్తులు రావడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.

మార్కాపురంజిల్లా పొదిలి మండలంలోని పలు స్వర్ణ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖి చేశారు. సచివాలయలలో పెన్షన్ల దరఖాస్తు కొసం వచ్చిన లబ్దిదారులతో ఆమె మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మొదట మండల పరిషత్ కార్యాలయం సందర్శించి పెన్షన్ల దరఖాస్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టిఆర్ పెన్షన్ల దరఖాస్తు రేపటితో గడువు ముగుస్తున్నందున త్వరగా దరఖాస్తులు చేసుకొవాలని అధికారులు యుద్దప్రాతిపధికన పనిచేయాలని తెలిపారు.

గడువుముగిసేలోగా దరఖాస్తు లన్ని ఆన్లైన్ చేయాలని అధికారులకు సూచించారు, పెన్షన్ల ధరఖాస్త పై ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తు చేసే విధంగా ప్రొత్సహించాలని ఆమె కొరారు.

అధికారుల పనితీరును మెరుగుపర్చుకొవాలని విజ్ఞప్తి చేశారు స్థానిక మున్సిపల్ ఆఫీసు పరిధిలో ఉన్న గణపతి విగ్రహాని దర్శించి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి మొక్కను తీర్చుకున్నారు స్థానిక మహిళలు కలెక్టర్ గారిని శాలవ కప్పి సన్మానించారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM