Markapuram: గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద తృటిలో తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం!

Markapuram: మార్కాపురం నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు దరిమడుగు గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద బేరింగ్ విరిగి టైర్ ఊడిపోగా, డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 July 2026 2:05 AM IST
Markapuram
X

Markapuram: గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద తృటిలో తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదం!

మార్కాపురం: మండలం దరిమడుగు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. మార్కాపురం నుంచి మాచర్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా బేరింగ్ విరిగిపోవడంతో ఒక టైర్ ఊడిపడింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును అదుపులోకి తీసుకువచ్చి రోడ్డుపక్కన నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో కొద్దిసేపు ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో ఎక్కించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తి, అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ప్రశంసించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story