Markapuram: ప్రగతిపై ఎంపీ మాగుంట ఎమ్మెల్యేల ఉన్నత స్థాయి సమీక్ష!
Markapuram: ప్రాంత అభివృద్ధిపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ విజయ సునీతలతో కలిసి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Markapuram: ప్రగతిపై ఎంపీ మాగుంట ఎమ్మెల్యేల ఉన్నత స్థాయి సమీక్ష!
మార్కాపురం: సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవల అందజేత, అధికారుల పనితీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.
అలాగే జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై శాఖల వారీగా పురోగతిని వివరించారు.జిల్లా అభివృద్ధికి వేగం పెంచుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు.




