Markapuram: వినూత్న నిరసన చొక్కాలు విప్పి డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన!

Markapuram: మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద జీవో 396కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి డాక్యుమెంట్ రైటర్ల నిరసన. ఈ నెల 30 వరకు పెన్‌డౌన్‌కు పిలుపు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 21 July 2026 11:47 AM IST
Markapuram
X

Markapuram: వినూత్న నిరసన చొక్కాలు విప్పి డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన!

Markapuram: మార్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.396ను వ్యతిరేకిస్తూ మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తూ చొక్కాలు విప్పి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ జీవో 396 కారణంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, ఇప్పటికే ప్రకటించినట్లుగా ఈ నెల 30వ తేదీ వరకు పెన్‌డౌన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు డాక్యుమెంట్‌ల తయారీలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో 396ను ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డాక్యుమెంట్ రైటర్లు హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story