Markapuram: శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలు, విద్యార్థులకు ఆర్థిక సాయం!

Markapuram: మార్కాపురంలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసరాలు, విద్యార్థులకు ఆర్థిక సాయం పాల్గొన్న డీఎస్పీ నాగరాజు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 5 Sept 2026 12:40 PM IST
Markapuram
X

Markapuram: శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలు, విద్యార్థులకు ఆర్థిక సాయం!

Markapuram: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పేద వృద్ధులకు నిత్యావసర సరుకులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు.. ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా 20 మంది పేద వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా.. ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. గత ఏడు సంవత్సరాలుగా శ్రీకృష్ణ సేవా సమితి నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవడం అభినందనీయమని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. దాతల సహకారంతో ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం తగ్గించడం గొప్ప సేవ అని అన్నారు.

“మనం ఎంత సంపాదించినా మన వెంట ఏదీ రాదు.. మనం చేసిన సేవ మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది” అని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో సమితి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, మార్కాపురం జిల్లాతో పాటు పక్క జిల్లాల్లోనూ పేదలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న పలువురు దాతలను డీఎస్పీ యు. నాగరాజు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి ఆడక రాజగోపాల్, జింక నరసింహారావు, గుమ్మా రాజగోపాల్, నాలి లక్ష్మీనారాయణ, శ్రీరాములు, గోసు సుబ్బారావు, పొట్టేళ్ల శ్రీకాంత్, తొలిచూరి రామకృష్ణ, గుమ్మ బాలనాగయ్య, బసవయ్య, అనిల్, కడియం అల్లూరయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నా.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story