Markapuram: ఎంపీ మాగుంటపై వైసీపీ నేతల వ్యక్తిగత విమర్శలు అర్ధరహితం!

Markapuram: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించిన మార్కాపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ డీవీ కృష్ణారెడ్డి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Sept 2026 10:28 AM IST
Markapuram
X

Markapuram: ఎంపీ మాగుంటపై వైసీపీ నేతల వ్యక్తిగత విమర్శలు అర్ధరహితం!

Markapuram: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు అర్ధరహితమని మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్ డీవీ కృష్ణారెడ్డి అన్నారు.మార్కాపురంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మాగుంట చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేయడం తగదన్నారు.

కృష్ణమ్మ నీళ్లు కరువు ప్రాంతానికి రావడం చూసిన ఆనందం, ఉద్వేగంలోనే మాగుంట వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఎవరి కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదన్నారు.

మాగుంట కుటుంబంపై వైసీపీ నేతలు సుధాకర్‌రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలే తప్ప.. కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉండకూడదన్నారు.

మాగుంట శ్రీనివాసులరెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఐదుసార్లు విజయం సాధించారని జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు గాయం నారాయణరెడ్డి తెలిపారు. ఇకనైనా వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధి, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని డీవీ కృష్ణారెడ్డి హితవు పలికారు.

మాగుంట కుటుంబం వైఎస్‌ఆర్ వల్లే రాజకీయాల్లోకి వచ్చిందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు వాస్తవం కాదని జెడ్ఆర్‌యూసీసీ సభ్యుడు గాయం నారాయణరెడ్డి పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story