Markapuram: కలనూతల వాగులో ముగ్గురి రెస్క్యూ ఎమ్మెల్యే కందులకు ప్రశంసలు!
Markapuram: మార్కాపురం జిల్లా కలనూతల వాగులో బొలెరో కొట్టుకుపోగా చెట్టుపై చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
Markapuram: కలనూతల వాగులో ముగ్గురి రెస్క్యూ ఎమ్మెల్యే కందులకు ప్రశంసలు!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల వద్ద భారీ నీటి ప్రవాహంలో బొలెరో వాహనం చిక్కుకోవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయంలో పడ్డారు. వాహనం నీటిలో కొట్టుకుపోవడంతో.. ముగ్గురూ సమీపంలోని చెట్టుపైకి ఎక్కి తమను కాపాడాలంటూ ప్రాణభయంతో కేకలు వేశారు.
సమాచారం అందుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రొక్లెయిన్ 210ను సంఘటనా స్థలానికి తరలించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తీవ్ర రిస్క్ మధ్య చెట్టుపై చిక్కుకున్న ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధికారులు రాత్రంతా సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.




