Markapuram: మార్కాపురంలో డెంగ్యూ రహిత ఆంధ్రప్రదేశ్ భారీ అవగాహన ర్యాలీ!
Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Markapuram: మార్కాపురంలో డెంగ్యూ రహిత ఆంధ్రప్రదేశ్ భారీ అవగాహన ర్యాలీ!
మార్కాపురం జిల్లా: మార్కాపురంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. ఆర్డీవో కార్యాలయం నుంచి కోర్టు సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం చేపట్టారు. “దోమలు పుట్టకుండా – కుట్టకుండా చేద్దాం” అనే నినాదాలతో ప్రజల్లో కీటక జనిత వ్యాధులపై చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులను నివారించవచ్చన్నారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే కీటక జనిత వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు కీటక జనిత వ్యాధుల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.




