Markapuram: DPO లో స్పందన దివ్యాంగుడి వద్దకు వెెళ్లి ఓఎస్డీ మానవత్వం!

Markapuram: మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన OSD నవజ్యోతి మిశ్రా.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 20 July 2026 5:11 PM IST
Markapuram
X

Markapuram: DPO లో స్పందన దివ్యాంగుడి వద్దకు వెెళ్లి ఓఎస్డీ మానవత్వం!

Markapuram: మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, బాధితుల సమస్యలను ఓపికగా విన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పొదిలి ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు తన సమస్యను వివరించేందుకు ఎస్పీ కార్యాలయానికి రావడంతో, విషయం తెలుసుకున్న ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా స్వయంగా అతని వద్దకు వెళ్లి సమస్యను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాధితుడికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అత్యంత నిశితంగా పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు శాఖ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story