Markapuram: మాజీ బీజేపీ నేతపై అసభ్యకర పోస్టర్లు.. మార్కాపురంలో ఏం జరుగుతోంది?
Markapuram: మార్కాపురం పట్టణంలో మాజీ బీజేపీ నాయకుడికి వ్యతిరేకంగా అసభ్యకర కరపత్రాలు వెలిశాయి.
Markapuram: మాజీ బీజేపీ నేతపై అసభ్యకర పోస్టర్లు.. మార్కాపురంలో ఏం జరుగుతోంది?
మార్కాపురం జిల్లా: మార్కాపురం పట్టణంలో మాజీ బీజేపీ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకర కరపత్రాలు అంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణంలోని పలు ప్రధాన దేవాలయాల ముఖద్వారాల గోడలపై ఈ కరపత్రాలు కనిపించడంతో ఉదయం ఆలయాలకు వచ్చిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
జిల్లాకు చెందిన మాజీ బీజేపీ నేత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానకర వ్యాఖ్యలతో ఈ కరపత్రాలు ముద్రించినట్లు సమాచారం. నేడు జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రను ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
“ఇలాంటి వ్యక్తులకు శోభాయాత్ర నిర్వహించే అర్హత లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అంటూ కరపత్రాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రధాన దేవాలయాల వద్దే ఈ పోస్టర్లు వెలుగుచూడడంతో హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే శోభాయాత్రకు భంగం కలిగించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మార్కాపురం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా, పోస్టర్లు అంటించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




