Markapuram: 134 మంది విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డులు!

Markapuram: మార్కాపురం జిల్లాలో 134 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డు-2026. రూ.20 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపిన కలెక్టర్ విజయ సునీత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 July 2026 3:49 PM IST
Markapuram
X

Markapuram: 134 మంది విద్యార్థులకు 'షైనింగ్ స్టార్స్' అవార్డులు!

Markapuram: జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు-2026 కు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్ -2026 అవార్డ్స్ బహుమతి ప్రధానోత్సవం పై జిల్లాలోని ఎంఈఓ లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపికైన విద్యార్థులకు రూ. 20వేల నగదు తో పాటు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

మార్కాపురం లోని జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, రూ. 20 వేల నగదు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మెగా పీ టీ ఎం 3.1 కు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ మొబైల్ లో 'లీప్ యాప్ 'ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ ఎస్.సుబ్బారావు, డి సీ ఈ బీ సెక్రటరీ ఎం. సుధాకర్, జిల్లాలోని అందరు ఎంఈవోలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story