Markapuram: మార్కాపురం జిల్లాలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ!
Markapuram: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా శనివారం అలవలపాడు, పెదచెర్లపల్లి నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు.
Markapuram: మార్కాపురం జిల్లాలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ!
మార్కాపురం జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా కనిగిరి సర్కిల్ పరిధిలోని పీసీపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించారు. అలవలపాడు, పెదచెర్లపల్లి గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో కనిగిరి సీఐ ఎం. సుబ్రహ్మణ్యం, పీసీపల్లి ఎస్‌ఐ బి. నరసింహారావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




