Markapuram: వెలిగొండ నిర్వాసితుల గ్రీవెన్స్‌లో అధికారుల నిర్లక్ష్యం!

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల గ్రీవెన్స్ సెల్‌కు సమయానికి రాని అధికారులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Sept 2026 11:50 AM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ నిర్వాసితుల గ్రీవెన్స్‌లో అధికారుల నిర్లక్ష్యం!

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు అధికారులు సమయానికి హాజరుకాకపోవడంతో బాధితులు గంటల తరబడి పడిగాపులు కాశారు.

ఉదయం 11 గంటలు దాటినా సంబంధిత అధికారులు రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్వాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

భూములు, ఇళ్లు కోల్పోయి ఏళ్లుగా పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూస్తున్న తమ సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story