Markapuram: మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర మార్కాపురానికి కృష్ణమ్మ జలాలు!

Markapuram: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంపై కందుల రామిరెడ్డి హర్షం. శ్రీశైలం కొల్లం వాగు నుంచి ఫీడర్ కెనాల్‌కు చేరుకున్న కృష్ణమ్మ జలాలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 31 Aug 2026 12:32 PM IST
Markapuram
X

Markapuram: మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర మార్కాపురానికి కృష్ణమ్మ జలాలు!

Markapuram: మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కరువు నేలకు కృష్ణమ్మ జలాలు చేరుతున్నాయని మార్కాపురం నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు.

శ్రీశైలం వద్ద కొల్లం వాగు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ జలాలు ఉరకలెత్తుతూ జంట సొరంగాల్లోకి ప్రవేశించాయి. సొరంగ మార్గంలో ప్రయాణించిన జలాలు గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్‌కు చేరుకున్నాయి. దీంతో వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది.

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమవుతోందని కందుల రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ఎంతో గొప్పదని కొనియాడారు.

కృష్ణమ్మ జలాలు ఫీడర్ కెనాల్‌కు చేరుకోవడంతో వెలిగొండ పరిధిలోని రైతులు, ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందని తెలిపారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ జరుగుతున్న ఈ పరిణామం వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుందని కందుల రామిరెడ్డి పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story