Markapuram: మార్కాపురంలో వాటర్ గ్రిడ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

Markapuram: మార్కాపురం గొట్టిపడియ వద్ద వాటర్ గ్రిడ్, పైప్‌లైన్ పనులను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత. ఈ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 July 2026 3:07 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో వాటర్ గ్రిడ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

మార్కాపురం జిల్లా: జలజీవన్ మిషన్ లో భాగంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద జరుగుతున్న వాటర్ గ్రిడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

అక్కడ జరుగుతున్న పనుల తీరు, పురోగతిని బుధవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఏ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం అందబోతుంది, ప్రస్తుత పనుల తీరు వంటి విషయాలను అధికారులు మ్యాప్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు.

అదేవిధంగా ఎల్ బి ఎస్ నగర్ లో జరుగుతున్న పైపు లైన్ పనులు సైతం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బీవి. నాగేశ్వరరావు, ఈఈ సురేష్ బాబు, డీఈ శ్రీనివాసులు, ఏఈ లు, ఇతర ప్రాజెక్టు సంబంధించిన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story