Nandyal: నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం రూ. కోటి ఆస్తి నష్టం!

Nandyal: కోవెలకుంట్లలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తో నిప్పులు, కోటి రూపాయల ఆస్తి నష్టం అంచనా.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Aug 2026 1:19 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం రూ. కోటి ఆస్తి నష్టం!

Nandyal: నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోవెలకుంట్లలోని సుబ్రహమణ్యేశ్వర పాలిమర్ ఫ్యాక్టరీలో మంది కార్మికులు పనిచేస్తుండగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగటంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పాలిమర్ తయారీకి ఉపయోగించే మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సుమారు కోటి రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు అంటున్నారు. ఫ్యాక్టరీకి అనుమతులు లేవని స్థానికులు ఆరోపించారు. వాటర్ ట్యాంకర్లతో ఫ్యాక్టరీ యాజమాన్యం మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story