Mitta Somapuram: భారీ అగ్ని ప్రమాదం.. గడ్డివాములు పూర్తిగా దగ్ధం
Mitta Somapuram: నందవరం మండలంలోని మిట్టా సోమాపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డివాములు, వ్యవసాయ పనిముట్లు దగ్ధమై రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
Mitta Somapuram
Mitta Somapuram: కర్నూలు జిల్లా; నందవరం మండలం మిట్టా సోమాపురం గ్రామంలో భారీగా అగ్ని ప్రమాదం ఈ అగ్ని ప్రమాదనికి మూడు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. రైతు తెలుగు లింగన్నకు చెందిన గడ్డివాము, వ్యవసాయ పనిముట్లు, ఎద్దుల కొట్టం ఒక్కసారిగా దగ్ధమవ్వడంతో రూ.3.5 లక్షల నష్టం వాటిల్లింది వాపోయారు. మరో రైతు భోజన్నకు రూ. 90 వేలు, లింగన్నకు రూ.1.2 లక్ష నష్టం సంభవించిందని స్థానికులు తెలిపారు..ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
Next Story




