Kurnool: రైతు రాజశేఖర్‌కు తీరని నష్టం.. మొక్కజొన్న చేను దగ్ధం
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడమలగుర్తిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైతు బోయ రాజశేఖర్‌కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.
Kurnool: రైతు రాజశేఖర్‌కు తీరని నష్టం.. మొక్కజొన్న చేను దగ్ధం
Kurnool: కోడుమూరు మండలం ముడమలగుర్తి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బోయ రాజ శేఖర్ అనే రైతు కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు అయింది. ఎంతో కష్టపడి పండించిన పంట రైతు చేతికి అందిన సమయంలో ఇలా అగ్నికి ఆహుతి కావడంతో రోదిస్తున రైతు. ప్రభుత్వం స్పందించి తనని ఆదుకోవాలి అని రైతు కోరాడు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పక్కనే ఉన్న గడ్డివాములకు సోకకుండా మంటలను అదుపుచేశారు. రైతులు ఈ వేసవి కాలంలో పొలాల దగ్గర గడ్డి వాముల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Next Story




