Srisailam: శ్రీశైలంలో పచ్చదనం.. 5 వేల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం!
Srisailam: పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్రంలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం మొదలైంది.
Srisailam: శ్రీశైలంలో పచ్చదనం.. 5 వేల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం!
Srisailam: శ్రీశైల మా క్షేత్రంలో ఈ వర్షాకాలం ముగిసే లోగా క్షేత్ర పరిధిలో పలుచోట్ల 5వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టబడిందన్నారు ఆలయం వలయ రహదారికి ఇరువైపుల మరిన్ని మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా ఆరు బయలు ప్రదేశాలలో దేవస్థానం ఉద్యాన వనాలలో మొక్కలను విస్తృతంగా నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు అవసరమైనచోట్ల నాటిన మొక్కలను త్రీ గాడ్స్ ఏర్పాటు చేయబడతాయన్నారు.
ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటిన చెట్ల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు దేవస్థానం ఉద్యానవనాలలో మరిన్ని సుందరీకరణ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
ఆరు బయలు ప్రదేశాలలో నీడనిచ్చే మొక్కలను నాటడం జరుగుతుందన్నారు క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక కథ కల్పించేందుకు అనువైన చోట్ల దేవత వృక్షాలను నాటాలని పేర్కొన్నారు నాటిన మొక్కలలో 30 నుంచి 40 శాతం దాకా దేవత వృక్షాలను ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని సంకల్ప పూర్వకంగా గణపతి పూజ నిర్వహించారు వృక్ష పూజలు నిర్వహించి మొక్కలు నాటడం జరిగిందన్నారు కదంబం,తెల్ల మద్ది,బాదం టూటూబియా రోజియా మొదలైన మొక్కలు నాటామని తెలిపారు.




