Kurnool: కార్డియాలజీ యూనివర్సిటీ టాపర్‌గా డా. పర్వేజ్ నవాజ్.. గోల్డ్ మెడల్ ప్రదానం!
Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీ కార్డియాలజీ టాపర్ డాక్టర్ పర్వేజ్ నవాజ్‌కు హెల్త్ వర్సిటీ వీసీ డా. పి. చంద్రశేఖర్ గోల్డ్ మెడల్ బహూకరించారు.
Kurnool: కార్డియాలజీ యూనివర్సిటీ టాపర్‌గా డా. పర్వేజ్ నవాజ్.. గోల్డ్ మెడల్ ప్రదానం!
కర్నూలు: కార్డియాలజీ యూనివర్సిటీ టాపర్ డా. పర్వేజ్ నవాజ్. డాక్టర్ రామకృష్ణారెడ్డి స్మారక అవార్డు" .. గోల్డ్ మెడల్ ప్రధానం చేసిన .డా. చంద్ర శేఖర్,. వైస్ చాన్సలర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. పూర్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, కార్డియాలజీ హెచ్ ఓ డి కీ.శే. డాక్టర్ రామకృష్ణారెడ్డి సేవలు అభినందనీయం అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు.
సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ భాగంలో పూర్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్డియాలజీ విభాగపు హెచ్ఓడి కీర్తిశేషులు డాక్టర్ రామకృష్ణారెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి కార్డియాలజీ విభాగానికి ఎంతో ఉత్తమ సేవలందించారని వారి అడుగుజాడల్లో డిపార్ట్మెంట్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.
యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఫిజియోథెరపీ నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు ప్రారంభించినందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వైద్య విద్యను మరింత పటిష్టం చేసి కీలక శాస్త్ర పరిశోధన వైపు అడుగులు వేయిస్తున్నామన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి కుమారుడు విజయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ గోల్డ్ మెడల్ ను ప్రతి సంవత్సరం కర్నూల్ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ లో మొదటి స్థానం సాధించిన వారికి అందిస్తున్నామని తెలిపారు.
ప్రతిసారి కర్నూల్ మెడికల్ కాలేజీ డిఎం విద్యార్థులే యూనివర్సిటీ టాపర్ గా వస్తున్నారని ఇది చాలా సంతోషమని తెలిపారు. బిఎస్సి పారా మెడికల్ విద్యార్థులు తమ సమస్యల గురించి వినతిపత్రం అందించారు. వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఏలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ, హాస్పిటల్ సూపర్డింట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కార్డియాలజీ విభాగాధిపతి డా. ఆదిలక్ష్మి,ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సూపర్ండెంట్ వైస్ ప్రిన్సిపల్ డా. శ్రీరాములు, డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ ,డా. లలిత కుమారి,డా. ప్రశాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు డా. కిరణ్ కుమార్ రెడ్డి, డా.రవి కిరణ్,డా. రాజ్ కుమార్,డా. హిమబిందు, సీనియర్ కార్డియాలజీ టెక్నీషియన్ లురమేష్, శివుడు, ఈసీజీ టెక్నీషియన్ తిరుమల్ రావ్, మనోహర్, పీజీ వైద్యులు స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.




