Banaganapalle: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం..

Banaganapalle: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త కొరతను అధిగమించేందుకు 'ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్' ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 24 Jun 2026 3:19 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం..

బనగానపల్లె: రక్తకొరత అధిగమించడానికి ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.దీనిని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉమాదేవి,డాక్టర్ శబ్నం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి మాట్లాడుతూ రక్తదాతలు అందించే రక్తం మరొకరి ప్రాణాలు నిలబెడుతుందని,ప్రతి ఒక్కరూ ఈ సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని కోరారు.ప్రజల ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అయిన రక్తదానాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మా సంస్థ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ శిబిరంలో యువత,సామాజిక సేవకులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రక్తదాత భూపాల్ యాదవ్ మాట్లాడుతూ "రక్తదానం మహాదానం"అని ఒక యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను రక్షించగలదని తెలిపారు.

ప్రమాదాలు,శస్త్రచికిత్సలు మరియు అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే రోగులకు ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.అలాగే బనగానపల్లె ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు నిర్వహించే సేవా కార్యక్రమాలు అమోఘం ప్రతినిధి షాషావలి ని ఈ సందర్భంగా వైద్యులు ప్రశంసించి సన్మానించడం జరిగింది.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవా భావాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు మణి,నస్రుద్దీన్,షరీఫ్,విశ్వేశ్వరావు,మెడికల్ స్టోర్ సాయి,షేక్షావలి,అస్లామ్ ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story