Kurnool: పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత.. నెలకు రూ. 20 వేల వరకు జీతం!
Kurnool: కర్నూలు నగరంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో నవంబర్ 30న నిర్వహించే జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొననున్నాయని జిల్లా ఉపాధి అధికారిణి పి. దీప్తి తెలిపారు.
Kurnool: పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత.. నెలకు రూ. 20 వేల వరకు జీతం!
Kurnool: నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని NAC శిక్షణ కేంద్రంలో ఈ నెల 30వ తేదీ, సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారిణి పి. దీప్తి గారు, తెలిపారు.ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు.
జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,000 నుండి రూ.20,000 వరకు జీతం లభిస్తుందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డుతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని అధికారులు కోరారు.




