Yemmiganur: చిరంజీవి బర్త్‌డే ప్రభుత్వ పాఠశాలకు RO ప్లాంట్ విరాళం!

Yemmiganur: పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీ MPPS పాఠశాలకు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో RO వాటర్ ప్లాంట్‌ను విరాళంగా అందజేశారు.

S Khaleel, Yemmiganur
Published on: 22 Aug 2026 4:26 PM IST
Yemmiganur
X

Yemmiganur: చిరంజీవి బర్త్‌డే ప్రభుత్వ పాఠశాలకు RO ప్లాంట్ విరాళం!

ఎమ్మిగనూరు: పద్మవిభూషణ్ డా, మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ అనంతరం ఎన్టీఆర్ కాలనీలో ఉన్న MPPS DPEP, పాఠశాలకు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో RO వాటర్ ప్లాంట్‌ను విరాళంగా అందించిన మెగా యూత్ ఫోర్స్ ఎమ్మిగనూరు కమిటీ సభ్యులు

విద్యార్థులకు శుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో RO ప్లాంట్‌ను పాఠశాలకు అందించడం జరిగింది. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించి, విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

RO ప్లాంట్‌ను అందించిన మెగా యూత్ ఫోర్స్ జిల్లా జాయింట్ కన్వీనర్ భరత్ సాగర్, మెగా యూత్ ఫోర్స్ ఎమ్మిగనూరు కన్వీనర్ పవర్ రాజు, మెగా యూత్ ఫోర్స్ స్పోక్ పర్సన్ కర్ణం రవి, జాయింట్ కన్వీనర్లు శివరాజు, చైతన్య, కో కన్వీనర్లు చరణ్, వీరేష్, అంజి, గోవర్ధన్, మరియు మెగా ఫ్యాన్స్ సీనియర్ నాయకులు మురవని భాష, కమిటీ సబ్యులను పాఠశాల తరఫున పూల మాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ నాయకులు భారత్ సాగర్, పవర్ స్టార్ రాజు, కర్ణం రవి లు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఆయన బాటలో కొనసాగుతూ మా వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగానే మా వంతుగా విద్యార్థుల ఆరోగ్యం మరియు సంక్షేమానికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు మెగా అభిమానులు పాల్గొన్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story