Banaganapalle: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్చండి బనగానపల్లె MEO
Banaganapalle: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్చాలని విద్యాశాఖ అధికారి (MEO) స్వరూప కోరారు.
Banaganapalle: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్చండి బనగానపల్లె MEO
బనగానపల్లె: ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్చాలని బనగానపల్లె మండల విద్యాశాఖ అధికారి స్వరూప బనగానపల్లె పట్టణం లోని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. బనగానపల్లె మండల విద్యాశాఖ అధికారి స్వరూప మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్నత విద్యా అర్హతలు గల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని విద్యార్థులకు కావలసినటువంటి ఉచిత పుస్తకాలు దుస్తులు రుచి కరమైన మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తారని తెలియజేశారు.
ప్రభుత్వ బడిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల నమ్మకాన్ని కలిగించే పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్చండి. ప్రభుత్వ బడిని కాపాడుకోండి అని సలహా ఇచ్చారు ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజం పట్ల అవగాహన నీతి, నిజాయితీ, కులమత బేధం లేకుండా ఉండే తత్వాన్ని బోధిస్తారని తెలియజేశారు.
అందుకోసం బడి బలహీనం కాకుండా ,బడి నిండా పిల్లలు ఉండాలని కోరారు. మీ బిడ్డలను భావి భారత పౌరులుగా సమాజానికి ఉపయోగపడే బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే భరోసా ప్రభుత్వ బడి కలిగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వై సుంకన్న ,యుటిఎఫ్ నంద్యాల జిల్లా సహాధ్యక్షులు కే సత్య ప్రకాష్ ,సయ్యద్ అబ్దుల్ ఖలీమ్ ,దర్గా ముంతాజ్ బేగం, నీలి మహేశ్వరమ్మ అంగన్వాడీ కార్యకర్త హేమలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




