Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీగా మెట్టు లక్ష్మీదేవి ఏకగ్రీవ ఎన్నిక!

Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీగా మెట్టు లక్ష్మీదేవి ఏకగ్రీవంగా, వైస్ ఎంపీపీగా జాజుల కాశీ నాగలక్ష్మి గురువారం ఎన్నికయ్యారు. 11 ఎంపీటీసీలు ప్రమాణం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 Nov 2026 9:09 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు ఎంపీపీగా మెట్టు లక్ష్మీదేవి ఏకగ్రీవ ఎన్నిక!

పెద్దారవీడు: మార్కాపురం జిల్లా, పెద్దారవీడు మండలంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన 11 మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మండలంలోని మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది.

అనంతరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా దేవరాజుగట్టు ఎంపీటీసీ సభ్యురాలు మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీగా తంగరాలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు జాజుల కాశీ నాగలక్ష్మిని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్వో రమేష్ కుమార్ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

నూతన ఎంపీపీ మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు సహకారంతో పెద్దారవీడు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, మండల సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో జాన్ సుందరం, తహసీల్దార్ రామకృష్ణ, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM