Banaganapalle: రోడ్డెక్కిన మంత్రి.. బనగానపల్లెలో 'స్వచ్ఛ ఆంధ్ర' సందడి!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్నారు.
Banaganapalle: రోడ్డెక్కిన మంత్రి.. బనగానపల్లెలో 'స్వచ్ఛ ఆంధ్ర' సందడి!
నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్చఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రతి నెల 3 వ శనివారం పరిసరాల శుభ్రతలో భాగం భాగంగా స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బనగానపల్లె పట్టణంలోని పోలీస్ క్వార్టర్ సమీపంలో ప్రభుత్వ అధికారులతో, ప్రజలతో కలిసి నిర్వహించిన "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
బనగానపల్లె పట్టణంలో పోలీస్ క్వార్టర్స్ లో చెత్తాచెదారం శుభ్రం చేసిన మంత్రి బి.సి జనార్దన్ రెడ్డి అనంతరం "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" పై ప్రజల చేత మంత్రి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
విద్యార్థులు ప్రతిరోజు తల్లిదండ్రులకు చెప్పి చెత్తబుట్టలో చెత్త బుట్టలలో చెత్తను వేయాలని మంత్రి విద్యార్థులను కోరారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్.. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. హరిత ఆంధ్ర ప్రదేశ్.. సంపన్న ఆంధ్ర ప్రదేశ్.. లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలననే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ రహిత బనగానపల్లె ను తీర్చి దిద్దడమే తన లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.




