Nandyal: బనగానపల్లెలో ఘనంగా ముస్లిం పెద్దల ఉరుసు వేడుకలు!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 26 Sept 2026 1:01 PM IST
Nandyal
X

Nandyal: బనగానపల్లెలో ఘనంగా ముస్లిం పెద్దల ఉరుసు వేడుకలు!

Nandyal: బనగానపల్లె పట్టణంలో హుస్సేనీ బాషా సాహెబ్, జండా వాలే సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు ఘనస్వాగతం పలికారు

అనంతరం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హుస్సేనీ బాషా సాహెబ్, జండా వాలే సాహెబ్ దర్గాలను సందర్శించారు. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించారు. బనగానపల్లె నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బనగానపల్లెలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలు హిందూ–ముస్లింల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రజలందరూ పరస్పర సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle