Avuku: అవుకులో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి!
Avuku: నంద్యాల జిల్లా అవుకులో స్వచ్ఛత అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేసిన మంత్రి.
Avuku: అవుకులో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి!
Avuku: నంద్యాల జిల్లా అవుకు గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అవుకు ప్రధాన వీధుల్లో నిర్వహించిన స్వచ్ఛత అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేస్తూ స్వచ్ఛత కార్యక్రమంలో స్వయంగా భాగస్వామ్యమయ్యారు. ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
“చెట్లు పెంచుదాం కాలుష్యాన్ని నివారిద్దాం పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మిద్దాం” అంటూ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇళ్లు, వీధులు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
అవుకులో ఆధునిక వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, బయోగ్యాస్, వేస్ట్ టు ఎనర్జీ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
స్వచ్ఛమైన గ్రామాలు, పచ్చని పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించడమే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే అది విజయవంతమవుతుందని తెలిపారు.
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యసాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆశయ సాధనకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో అవుకు ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.




