Srisailam: సుండిపెంటలో రూ.35 లక్షలతో లైటింగ్ ప్రారంభం!

Srisailam: శ్రీశైలం మండలం సుండిపెంటలో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్‌ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 18 Sept 2026 2:18 PM IST
Srisailam
X

Srisailam: సుండిపెంటలో రూ.35 లక్షలతో లైటింగ్ ప్రారంభం!

Srisailam: శ్రీశైలం మండలం సుండిపెంటలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 35లక్ష ల ఖర్చుతో లైటింగ్ సిస్టం ను ప్రారంభిచిన మంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా కరెంటు బిల్లులను పెంచకూడదని సీఎం చంద్రబాబు సంకల్పించారు.. మంత్రి గొట్టిపాటి

పిఎమ్ కిసాన్ ద్వారా రైతులకు పగటి పూట కరెంటు ఇచ్చేందుకు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది, మంత్రి గొట్టిపాటి

కూటమి ప్రభుత్వం వచ్చాకా రాష్ట్రంలో కొత్త సబ్ స్టేషన్ ల నిర్మాణాలు జరుగుతున్నాయి,సూర్య ఘర్ పిఎమ్ కిసాన్ ద్వారా వినియోగదారులకు లబ్ది చేకురుస్తున్నాం,మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఎల్ నీనో ఎఫెక్ట్ వలన అధిక విద్యుత్ వినియోగం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మేలైన విద్యుత్ అందిస్తున్నాం, అవసరమైతే బయట నుండి విద్యుత్ కొనుగోలు చేసైనా ప్రజలకు సమస్య లేకుండా చూస్తాం..మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఫారెస్ట్ శాఖ నుండి అనుమతులు రాగానే శ్రీశైలం, సుండిపెంట లకు విద్యుత్ సమస్య లేకుండా అవసరమైన సబ్ స్టేషన్ ల నిర్మాణం చేపడతాం..మంత్రి గొట్టిపాటి

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీ గారి పుట్టిన రోజు ను మల్లన్న స్వామి సన్నిధిలో జరుపుకోవడం సంతోషంగా ఉంది, మంత్రి గొట్టిపాటి ప్రపంచంలోనే మన దేశాన్ని ఆర్ధిక శక్తి గా నిలబెట్టేందుకు మోదీ ఎంతో కృషి చేస్తున్నారు, మంత్రి గొట్టిపాటి

ప్రధాని మన రాష్ట్రానికి అందిస్తున్న చేయూతతో పోలవరం,వెలిగొండ ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాయి.రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ఆయన సహకారం ఉంది, మంత్రి గొట్టిపాటి.

రాష్ట్రంలో జరగబోయే స్ధానిక ఎన్నికలలో అభివృద్ధి చేస్తున్న కూటమి కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క అవకాశం అడిగన జగన్ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు..మంత్రి గొట్టిపాటి

సంక్షేమ పధకాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రం చెయ్యనంత ఖర్చు ను సీఎం చంద్రబాబు చేస్తున్నారు, తల్లికి వందనం,మహిళలకు ఫీ బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చిన ఘణుడు సీఎం చంద్రబాబు,మంత్రి గొట్టిపాటి రవికుమార్

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM