Nandyal: నంద్యాలలో ఛైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలో గొలుసు అపహరణ

Nandyal: నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో ఘోర ఛైన్ స్నాచింగ్ జరిగింది.

R Pavankalyan, Nandyal
Published on: 21 Jun 2026 11:11 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాలలో ఛైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలో గొలుసు అపహరణ

నంద్యాల: నంద్యాల లో ఛైన్ స్నాచింగ్ కలకలం.. ఉప్పరిపేటలో మహిళను మోసం చేసి రూ.4 లక్షల బంగారు గొలుసు అపహరణ నంద్యాల పట్టణం లోని ఉప్పరిపేట ప్రాంతంలో ఛైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటి అద్దెకు కావాలని చెప్పి వచ్చిన ఓ దుండగుడు, చాకచక్యంగా మహిళను మోసం చేసి ఆమె మెడలో ఉన్న సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసును అపహరించినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, ఇంటి అద్దె విషయమై మాట్లాడేందుకు వచ్చిన వ్యక్తి ముందుగా మహిళతో నమ్మకం కల్పించేలా మాట్లాడాడు. అనంతరం అనూహ్యంగా మహిళ మెడలో ఉన్న బంగారు ఛైన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన అంతా క్షణాల్లో జరిగిపోవడంతో బాధితురాలు తీవ్ర ఆందోళనకు గురైంది.

బాధితురాలి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకుని దుండగుడిని వెంబడించేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు అప్పటికే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నంద్యాల వన్ టౌన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నగరంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story