Kurnool: స్వీయ రక్షనే మహిళలకు శ్రీరామరక్ష.. స్త్రీ శక్తి యాప్ వాడండి
Kurnool: కర్నూలు జిల్లా సి.బెళగల్‌లో మహిళలపై నేరాల అదుపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.
Kurnool: స్వీయ రక్షనే మహిళలకు శ్రీరామరక్ష.. స్త్రీ శక్తి యాప్ వాడండి
Kurnool: కర్నూలు జిల్లా సి.బెళగల్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలపై నేరాలు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుటుంబ హింస నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానం, స్వీయ రక్షణ పద్ధతులు గురించి వివరించి మహిళలకు అవగాహన కల్పించడమైనది.
మహిళల కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం మహిళా బిల్లును కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని 25 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుందని అన్నారు. మహిళల కోసం టీడీపీ మొట్టమొదటి సారిగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు మరియు 33% ఉద్యోగాలలో అవకాశం కల్పించిన ఘనత టీడీపీ పార్టీకి దక్కుతుంది అని అన్నారు.అందరికి ఆమోఘ యోగ్యంగా మహిళా బిల్లును ఆమోదం పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకోడం సరికాదని అన్నారు.
మహిళల రక్షణకు సంబంధించిన చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ అమలు చేస్తున్న భద్రతా చర్యలు గురించి తెలియజేసి మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.మహిళలు ఎలాంటి భయాందోళనలకు లోనవకుండా ధైర్యంగా ముందుకు రావాలని, సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే స్త్రీ శక్తి యాప్ ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజం మొత్తం కలిసి మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వెంకటలక్ష్మి , ఎంపిడిఓ రాణెమ్మ , సిఐ తబ్రేజ్, ఎస్ఐ వేణు గోపాల్ రాజు ,టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.




