Kodumur: పొలకలలో సబ్సిడీ శెనగ విత్తనాల పంపిణీ..ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి!

Kodumur: కోడుమూరు నియోజకవర్గం పొలకల్‌లో సబ్సిడీ పప్పు శెనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేసి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే దస్తగిరి.

C. Ganesh, Kodumuru
Published on: 1 Oct 2026 4:31 PM IST
Kodumur
X

Kodumur: పొలకలలో సబ్సిడీ శెనగ విత్తనాల పంపిణీ..ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి!

Kodumur: కోడుమూరు నియోజకవర్గం సి.బెలగల్ మండలంలోని పొలకల్ గ్రామంలో రైతులకు సబ్సిడీపై పప్పు సెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు సబ్సిడీపై అందిస్తున్న పప్పు సెనగ విత్తనాలను పంపిణీ చేసి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు సాగులో ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను అర్హులైన ప్రతి రైతుకు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి, రైతుల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru