Srisailam: సుండిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవానికి ఎమ్మెల్యే పిలుపు!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 14 Nov 2026 10:22 AM IST
Srisailam
X

Srisailam: సుండిపెంటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవానికి ఎమ్మెల్యే పిలుపు!

Srisailam: శ్రీశైలం మండలం సుండిపెంటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సుండిపెంట రెడ్ల కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు,నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సుండిపెంట మొదటిసారి పంచాయతీ ఎలక్షన్ రాబోతుందని గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఊరి బాగుపడుతుందని గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సుండిపెంట గ్రామ పంచాయితీ రావడం తన కల అని తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

అలానే స్థానిక సంఘాల నాయకులు వట్టి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంతో వారికున్న అనుభవాలను తెలిపారు పంచాయతీ ఎలక్షన్ ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్థులు,స్థానిక నాయకులు అందరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముందే తెలియజేసారు.

సుండిపెంట గ్రామంలో మొత్తం జనాభా 22 వేల మంది కాగా అందులో 14 వేల 668 మంది ఓటు హక్కు కలిగిన ప్రజలు ఉండగా ఇందులో మహిళలు 7554 మంది పురుషులు 7113 మంది ఉన్నారు ఇప్పటికే సుండిపెంట పంచాయతీని 14 వార్డులుగా విభజించి 28 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మరోపక్క ఈనెల ఆఖరి లోపు ఎలక్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేసినట్లు మండల అధికారుల ద్వారా సమాచారం తెలుస్తుంది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM