Devanakonda: ఓటర్ల జాబితాపై వైఎస్సార్‌సీపీ అలర్ట్..
Devanakonda: దేవనకొండ మండలం వెలమకూరు గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SSR) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.
Devanakonda: ఓటర్ల జాబితాపై వైఎస్సార్‌సీపీ అలర్ట్..
దేవనకొండ: మండల పరిధిలోని వెలమకూరు గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో దస్తగిరి దేవేంద్రప్ప పాల్గొని వారు మాట్లాడుతూ రానున్న నాలుగు వారాలు కీలకమైనవని, ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించి ఓటర్ల జాబితాలో మార్పులను గమనించాలని కోరారు.
ప్రతి బూత్‌లోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి పేర్లు జాబితాలో కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని బీఎల్‌ఏలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ఓటర్ల జాబితా పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ కిట్టు, మండల కమిటీ సభ్యులు మరియు ఎంపీటీసీ అబ్రహం, కురువ లక్ష్మప్ప, దస్తగిరి, గొల్ల దేవేంద్రప్ప, గొల్ల మహేష్, గొల్ల శీను, తదితరులు ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




