Yemmiganur: మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థితో కలిసి వివిధ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే!
Yemmiganur: ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్పర్సన్ అభ్యర్థి మాచాని సునీతకు మద్దతుగా ప్రచారం.
Yemmiganur: మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థితో కలిసి వివిధ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే!
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు వార్డుల్లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి మాచాని సునీతకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. టీడీపీ అభ్యర్థులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




