Nandyal: సీఎం చంద్రబాబు బర్త్‌డే గిఫ్ట్: భువనేశ్వరి విరాళంతో పేదలకు ఉచిత భోజనం
Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌లో పేదలకు ఉచిత భోజన పంపిణీ.
Nandyal: సీఎం చంద్రబాబు బర్త్‌డే గిఫ్ట్: భువనేశ్వరి విరాళంతో పేదలకు ఉచిత భోజనం
నంద్యాల జిల్లా: నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అన్న క్యాంటీన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేసి, కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. అనంతరం ప్రజలకు ఉచితంగా అన్నాక్యాంటిన్ లో అల్పాహారం అందజేశారు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి 76లక్షలు విరాళంగా ప్రకటించగా, ఆ నిధులతో దాదాపుగా 269 అన్న క్యాంటీన్లలో పేదలకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని ఏర్పాట్లు చెయ్యడం జరిగింది. సాధారణంగా ఐదు రూపాయలకే లభించే ఈ భోజనం, ఈ ఒక్కరోజు మాత్రం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉచితంగా అందనుంది.
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మించిన తృప్తి మరొకటి లేదన్న ఎమ్మెల్యే.పేదల పట్ల చంద్రబాబుకున్న మమకారానికి నిదర్శనం.అన్న క్యాంటీన్లు పేద ప్రజలకు ఒక అమ్మలా అండగా నిలుస్తున్నాయని భువనేశ్వరి ని గిత్త జయసూర్య ఈ సందర్భంగా కొనియాడారు. అనుక్షణం పేదల సంక్షేమం కోసం పరితపించే చంద్రబాబుకు, ఆకలి తీర్చే ఈ కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం కంటే మించిన బహుమతి లేదని ఆయన అన్నారు .కార్మికులు, వలస కూలీలు మరియు సామాన్యుల పట్ల నారా కుటుంబానికి ఉన్న నిబద్ధతకు ఈ విరాళం ఒక నిదర్శనంగా నిలుస్తోంది పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని అన్న ఎమ్మెల్యే జయసూర్య.అనంతరం సహకార సంఘం చైర్మన్ మూర్తుజవలి ఏర్పాటు చేసిన చలివెంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే.




