Nandikotkuru: కోటవీధి ఆంజనేయ స్వామి గుడి వద్ద పారపట్టిన ఎమ్మెల్యే

Nandikotkuru: నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య “స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘నో వెహికల్ డే’ పాటించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 16 May 2026 3:03 PM IST
Nandikotkuru
X

Nandikotkuru: కోటవీధి ఆంజనేయ స్వామి గుడి వద్ద పారపట్టిన ఎమ్మెల్యే

నందికొట్కూరు: స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య బుధవారం ‘నో వెహికల్ డే’ పాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గించి ఇంధన పొదుపు పాటించే ఉద్దేశంతో ఎమ్మెల్యే గిత్త జయసూర్య అల్లూరు గ్రామం నుండి నందికొట్కూరు పట్టణం వరకు దాదాపు 5 కి.మీ. దూరం బైక్‌పై ప్రయాణించి, 18వ వార్డు కోటవీధిలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, “పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి అందరూ కట్టుబడి ఉండాలి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలి. మనతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story