Kurnool: సుద్ధవాగును శుభ్రం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్!
Kurnool: కర్నూలు కల్లూరు అర్బన్ 19వ వార్డులో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'.
Kurnool: సుద్ధవాగును శుభ్రం చేసిన ఎమ్మెల్యే కలెక్టర్!
కర్నూలు: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం లో భాగంగా కర్నూలు పట్టణం కల్లూరు అర్బన్ 19 వ వార్డు నందు గల సుద్ధ వాగును శుభ్రం చేస్తున్న కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారితో కలిసి పాల్గొన్న పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా 4 వారాల ప్రత్యేక కార్యాచరణతో రహదారులు, డ్రైన్లు, కాలనీలు, ప్రజా మరుగుదొడ్లు మరియు చెత్త సమస్య ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచి ఆరోగ్యవంతమైన పట్టణాల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుదాం,పరిశుభ్రమైన పరిసరాలు మన అందరి బాధ్యత. కలిసి స్వచ్ఛమైన, సుందరమైన పట్టణాన్ని నిర్మిద్దాం అని తెలిపారు.
Next Story




