Nandyal: అభివృద్ధి చూసి ఓర్వలేకనే జగన్ విమర్శలు: గౌరు చరిత రెడ్డి ఫైర్!

Nandyal: నంద్యాలలో వైఎస్ జగన్‌పై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తీవ్ర విమర్శలు. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు, నేతలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 26 May 2026 4:15 PM IST
Nandyal
X

Nandyal: అభివృద్ధి చూసి ఓర్వలేకనే జగన్ విమర్శలు: గౌరు చరిత రెడ్డి ఫైర్!

నంద్యాల : మాజీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిపై పాణ్యం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా టిడిపి కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు , ఎన్ఎండి ఫరూక్ గారు, టిడిపి నేతలు గౌరు వెంకటరెడ్డి గారు, ఫిరోజ్ గారితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

జగన్ “మెరుపు తీగలా వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి వెళ్లిపోతారని”, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై కోర్టులకు వెళ్తున్నారని, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

“గొడ్డలి పార్టీ” అనగానే శాంతి దూతలమని చెప్పుకుంటారని చరిత రెడ్డి గారు ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ “సొంత బాబాయిని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు” అని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story