Kurnool: లక్ష్మీపురం, బొల్లవరం గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన!
Kurnool: లక్ష్మీపురం, బొల్లవరం గ్రామాల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పర్యటించి, పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కరపత్రాలు పంపిణీ చేశారు.
Kurnool: లక్ష్మీపురం, బొల్లవరం గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృత పర్యటన!
కర్నూలు: కల్లూరు అర్బన్ 28 వ వార్డ్ లక్ష్మీపురం గ్రామం మరియు కల్లూరు మండలం బొల్లవరం,గ్రామాల్లో పర్యటించి గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పల్లెకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం అని కరపత్రాలు అందజేసి ప్రజలకు వివరించిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి,క్లస్టర్ ఇంచార్జి మహానంది,లక్ష్మీపురం గ్రామం నాయకులు మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి,రాధాకృష్ణ రెడ్డి, రామిరెడ్డి, శివ, మారెన్న, పందిపాడు గ్రామ నాయకులు శేఖర్ చౌదరి, దేవేందర్ రెడ్డి, బొల్లవరం గ్రామ నాయకులు మస్తాన్ నాయుడు,విజయ్,పీవీ రమణ రెడ్డి మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




