Yemmiganur: ఎమ్మిగనూరు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

Yemmiganur: ఎమ్మిగనూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసిన ఎమ్మెల్యే డా. జయ నాగేశ్వర రెడ్డి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 July 2026 3:43 PM IST
Yemmiganur
X

Yemmiganur: ఎమ్మిగనూరు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

ఎమ్మిగనూరు: మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం (PGRS) మరియు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) పై కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మంజూరైన ల్యాప్‌టాప్‌ను ఎమ్మెల్యే అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, విద్యకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

అనంతరం ప్రజల నుండి భూ సమస్యలు, భూ వివాదాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కొత్త పింఛన్ దరఖాస్తులు, సీఎం సహాయ నిధి (CMRF) దరఖాస్తులు మరియు ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తదనంతరం పార్టీ నాయకులు, క్లస్టర్ కన్వీనర్లు, బూత్ ప్రతినిధులతో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశంలో, ఇప్పటివరకు 77% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs)తో సమన్వయంగా మరింత సమయం కేటాయించి ఇంటింటి ఓటరు ధృవీకరణ పూర్తి చేసి, MyTDP యాప్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, టీడీపీ మండల మరియు పట్టణ కమిటీ నాయకులు, క్లస్టర్ కన్వీనర్లు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story